Khammam Police News: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
డ్రోన్లతో నిఘా పెంచిన ఖమ్మం జిల్లా పోలీసులు
ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ గారి ఆదేశాల మేరకు, సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో అక్రమ కోడి పందేలను పూర్తిగా అరికట్టేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు జరుగుతున్న స్థావరాలను గుర్తించేందుకు డ్రోన్ల సహాయంతో విస్తృత స్థాయిలో నిఘా కొనసాగిస్తున్నారు. సాంప్రదాయ పండుగలను అక్రమ కార్యకలాపాలకు వేదికగా మార్చకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
డ్రోన్ నిఘాతో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపి, అనుమానాస్పద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడి పందేలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
సంక్రాంతి పండుగను శాంతియుతంగా, చట్టబద్ధంగా జరుపుకోవాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఖమ్మం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


