Nirmal CM’s meeting: ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభ
ఈ నెల 16న నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్‌తో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అన్ని అంశాలను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
సభ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ జిల్లా ప్రజలకు ఒక కీలక కార్యక్రమం కావడంతో, దీనిని విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిదని తెలిపారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


