Railway GM Sanjay Kumar Srivastava: మల్కాజిగిరి సమస్యలపై చర్చ
హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ రైల్వే నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ గారితో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో నెలకొన్న పలు రైల్వే సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు (ROB), రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు (RUB) నిర్మాణాలు, నూతన రైల్వే ట్రాక్ లైన్‌ల ఏర్పాటు అంశాలు ప్రాధాన్యతగా చర్చించారు.
అలాగే ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే దిశగా పలు రైళ్లకు హాల్టింగ్ సదుపాయాలు కల్పించడం, నూతన రైల్వే స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి సంబంధిత ప్రతిపాదనలను జీఎం దృష్టికి తీసుకువచ్చారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఈ సమావేశం కీలకంగా మారనుందని అభిప్రాయం వ్యక్తమైంది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


