Ambedkar Yuvajana Sangham: అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు
ఖిలాషాపూర్: ఖిలాషాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను అంబేద్కర్ యువజన సంఘం(Ambedkar Yuvajana Sangham) ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి, షీల్డులు అందజేసి నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పగిడిపాటి సుధా – సుగుణాకర్ రాజు దంపతులు హాజరయ్యారు. వారిని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శాగ. కవిత – అశోక్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ యువజన సంఘ స్థాపక మండలి అధ్యక్షులు శాగ. కైలాసం సభాధ్యక్షులుగా వ్యవహరించగా, ప్రధాన కార్యదర్శి చీటకోయిల హరీష్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా సంఘం సీనియర్ నాయకులు కోడిదేటి శంకర్, శాగ. మహేశ్వర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా శాగ. అరుణ్, ప్రధాన కార్యదర్శిగా జంగారగాని బాలకృష్ణ, కార్యదర్శిగా గంధమల్ల క్రాంతి ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో సర్పంచ్ శాగ. కవిత – అశోక్, మాజీ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్ గౌడ్, ఉప సర్పంచ్ బక్క సరిత – మల్లేష్, వార్డు సభ్యులు రాములు, కొమురమ్మ, అనిత, నాగేష్, సరిత, సునీత, ఉమా, మురళి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నక్క. సురేష్, సుదర్శన్, ఆంజనేయులు, యాదగిరి, ధనుంజయ, కమల్ హాసన్, రాకేష్, అరుణ్, అనిల్, శ్రీను, శివనాథ్, అమర్, భాస్కర్, రంజిత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, సామాజిక ఐక్యతకు అంబేద్కర్ యువజన సంఘం నిరంతరం కృషి చేస్తుందని నేతలు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


