Jeedimetla rain water problem – లింక్ రోడ్డు అంశంపై సమీక్ష
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: జీడిమెట్ల డివిజన్‌లో వర్షాకాలంలో డిఫెన్స్ ఏరియా నుంచి వచ్చే వర్షపు నీటివల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి ఉదయం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. వర్షం కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, తక్షణ పరిష్కార చర్యలపై అధికారులతో చర్చించారు.
అదేవిధంగా కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాపు నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల నుంచి ఆర్మీ ఏరియా మీదుగా సుచిత్ర ఎంఎంఎటీఎస్ స్టేషన్‌కు లింక్ రోడ్డు ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలించారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే స్థానికుల ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
ఈ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న కాలనీలుగా బ్యాంక్ కాలనీ, ఎంఎన్ రెడ్డి నగర్ (ఫేస్–1,2), వెంకటేశ్వర కాలనీ ఈస్ట్–వెస్ట్, దత్తాత్రేయ నగర్, వాజపేయి నగర్, ప్రసూనా నగర్, శ్రీనివాస్ నగర్ (ఫేస్–1 నుంచి 4), ద్వారకా నగర్, రాఘవేంద్ర కాలనీ, HAL రాఘవేంద్ర కాలనీ, దుర్గ ఎస్టేట్, న్యూ మాణిక్య నగర్, ఫస్ట్ అవెన్యూ కాలనీ, వసంత విహార్ కాలనీలను గుర్తించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు డా. ఎస్. మల్లారెడ్డి, జీడిమెట్ల కార్పొరేటర్ తార రెడ్డి, సీనియర్ నాయకులు భరత్ సింహ రెడ్డి, కట్ట కుమార్, రాజి రెడ్డి, పి. సతీష్, మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


