Chevella constituency development: చేవెళ్ల నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు, సౌకర్యాలు మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సుమారు రూ.100 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సహచర మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారు, ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, స్థానిక శాసన సభ్యులు శ్రీ కాలే యాదయ్య గారు, శ్రీ మనోహర్ రెడ్డి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి రూపాయిని ప్రజల అభివృద్ధికే వినియోగిస్తూ, ప్రాంత సమగ్ర పురోగతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


