Nalgonda Development: నల్లగొండ పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు – రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నల్లగొండ పట్టణాన్ని ఆధునికంగా అభివృద్ధి చేసే దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఈరోజు నల్లగొండ పట్టణంలో శంకుస్థాపనలు నిర్వహించడం జరిగింది.
ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా
మంచినీటి సరఫరా మెరుగుదల, పార్కుల అభివృద్ధి, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, స్మశానవాటికల అభివృద్ధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌కు కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి కీలక పనులు చేపడుతున్నారు.
ఈ పనులు పూర్తయితే పట్టణంలోని మౌలిక వసతులు మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ,
నల్లగొండను ఆధునిక, సుస్థిర నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


