back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsసద్దలగుండు వార్డ్‌లో ఉచిత కంటి పరీక్షలు, బోర్ మోటార్ ప్రారంభం – శ్రీనివాస్ గౌడ్

సద్దలగుండు వార్డ్‌లో ఉచిత కంటి పరీక్షలు, బోర్ మోటార్ ప్రారంభం – శ్రీనివాస్ గౌడ్

Saddalagundu Ward: బోర్ మోటార్ ప్రారంభించిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి సద్దలగుండు వార్డ్ నంబర్ 41లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరేష్, లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలు మరియు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకుంటున్న మహిళలతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్హులైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన సూచించారు.

అలాగే, నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న సద్దలగుండు ప్రాంత ప్రజల సమస్యను గుర్తించిన నరేష్, లక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్ మోటార్‌ను మాజీ మంత్రి ప్రారంభించారు. ఈ బోర్ మోటార్ ద్వారా స్థానికులకు తాగునీటి సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టడం బిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు తెలిపారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles