GWMC: GWMC సమీక్ష సమావేశం
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో వివిధ విభాగాల అధికారులు, సానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు ఆస్కి (ASKI) ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డివిజన్‌ల వారీగా చెత్త తరలింపు వాహనాల మరమ్మత్తులు, స్వచ్ఛ ఆటోలు–రోబో వాహనాల రిపేర్లను వేగవంతం చేయాలని సూచించారు. ICCC (Integrated Command and Control Centre)లో వాహనాల ట్రాకింగ్ వ్యవస్థను నిరంతరం అప్డేట్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
పోతన ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో వెయిటింగ్ సమయాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని, అక్రమంగా మల వ్యర్థాలు డంపింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆస్కి తరఫున ఫిబ్రవరి–మార్చి నెలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
రోజుకు 70–80 ట్యాంకర్లు FSTP (Faecal Sludge Treatment Plant) కు చేరేలా చర్యలు తీసుకోవాలని, కంపోస్ట్ విక్రయాలు పెంచడం, RRR (Reduce, Reuse, Recycle) సెంటర్ల పనితీరు మెరుగుపరచడం పై దృష్టి సారించారు.
అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన మార్కులు సాధించడం, ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల పురోగతిని సమీక్షించి లక్ష్యాలను చేరుకోవాలని అధికారులు నిర్ణయించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


