Borabanda Waqf land issue: ప్రజా మద్దతుకు కృతజ్ఞతలు
ఆత్మీయ సన్మానం చేసినందుకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు శ్రీ లంకాల దీపక్ రెడ్డి గారు
తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో ముస్లిం శ్మశానవాటిక కోసం వక్ఫ్ బోర్డుకు కేటాయించిన సుమారు ఒక ఎకరం భూమి (దాదాపు రూ.30 కోట్ల విలువైన భూమి) అంశంపై గౌరవనీయ హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేయడం న్యాయవ్యవస్థలో నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది.
ఈ అంశంలో నాకు లభించిన అపారమైన ప్రజా మద్దతు, సత్యం కోసం నిలబడటానికి మరియు హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పని చేయడానికి మరింత ప్రేరణను అందిస్తోంది.
ప్రజల విశ్వాసానికి, మద్దతుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటూ, న్యాయం మరియు ధర్మ పరిరక్షణ మార్గంలో నా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


