Medaram Cabinet Meeting: మేడారంలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
చరిత్రలో తొలిసారిగా మేడారంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం – భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు: దనసరి సీతక్క
చరిత్రలో తొలిసారిగా అటవీ దేవతల దివ్య సన్నిధిలో మేడారంలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి దనసరి సీతక్క తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సభ్యులు మరియు మొత్తం పరిపాలనా యంత్రాంగం మేడారంలో సమావేశం కానున్న నేపథ్యంలో, భక్తుల దర్శనాలు ఎలాంటి అసౌకర్యం లేదా అంతరాయం లేకుండా సజావుగా జరిగేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు.
సాధారణంగా సచివాలయానికే పరిమితమయ్యే ఉన్నత స్థాయి క్యాబినెట్ సమావేశం, ఈసారి అడవుల మధ్య, ప్రకృతి ఒడిలో, అటవీ దేవతల సాక్షిగా జరగనుండటం చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుందని తెలిపారు. ఈ సమావేశం ద్వారా ప్రజలకు పాలన మరింత దగ్గరవుతుందని, సంప్రదాయాలు–పాలన మధ్య సమన్వయం ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ చారిత్రాత్మక క్షణాన్ని ప్రజలు, భక్తులు, రాష్ట్ర యంత్రాంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని దనసరి సీతక్క తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


