HYDRA Telangana: 4 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్
జలమండలి భూమిని అక్రమాల నుంచి కాపాడుతూ హైడ్రా కీలక చర్యలు చేపట్టింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 388లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)కు చెందిన 4.01 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకొని రక్షించింది.
జలమండలి అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఈ భూమిని కేటాయించగా, భూమి స్వాధీన ప్రక్రియలో స్థానికుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రహరీ (ఫెన్సింగ్) నిర్మాణాన్ని అడ్డుకుంటూ ఇబ్బందులు సృష్టించడంతో జలమండలి అధికారులు హైడ్రా సహాయాన్ని కోరారు.
దీనిపై స్పందించిన హైడ్రా, సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఈ భూమి పూర్తిగా జలమండలికి ప్రభుత్వంగా కేటాయించబడినదేనని ధృవీకరించింది. శనివారం ఈ భూమి చుట్టూ 4.01 ఎకరాల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, జలమండలి భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ భూములను అక్రమాల నుంచి రక్షించడంలో హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములపై ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


