HYDRA Hyderabad : రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి
హైదరాబాద్: కొండాపూర్ ప్రాంతంలో సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRA) అధికారులు రక్షించారు. కొండాపూర్ లోని జంగమోని కుంట ఆక్రమణలపై హైడ్రా సీరియస్‌గా స్పందించి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.
శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం – మదీనగూడ మార్గంలో ఉన్న జంగమోని కుంటపై అక్రమంగా మట్టి పోసి చదును చేసి, ప్లాట్లుగా విభజించి అమ్మకానికి సిద్ధం చేసిన కబ్జాదారులపై అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 4 ఎకరాల జంగమోని కుంటను పూర్తిగా మాయం చేసినట్లు గుర్తించారు.
ఇటీవల జంగమోని కుంట మాయం అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో హైడ్రా, రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. పరిశీలనలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి.
కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. చెరువును పునరుద్ధరించి కాపాడేందుకు హైడ్రా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ, భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తున్నారు.
చెరువులను సంరక్షించడం ద్వారా నగరంలో పర్యావరణ సమతుల్యతను కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రా కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


