హైదరాబాద్, నాంపల్లి:iBOMMA నిర్వాహకుడు రవి తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు వివరాలు సమర్పిస్తూ, కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా, రవికి విదేశాల్లో పౌరసత్వం ఉన్నందున బెయిల్ లభిస్తే విదేశాలకు పారిపోయే అవకాశముందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
పోలీసుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు, రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


