back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsహుస్నాబాద్ మునిసిపాలిటీలో ఇందిరమ్మ గృహనిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ

హుస్నాబాద్ మునిసిపాలిటీలో ఇందిరమ్మ గృహనిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం 

హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం స్వర్ణకారుల సంఘం భవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పాల్గొని, మున్సిపాలిటీకి చెందిన 8, 9, 17, 18, 19 వార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

అలాగే 3520 మంది మహిళలకు రూ.1 కోటి 13 లక్షల విలువైన వడ్డీలేని రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇందిరమ్మ పథకం ద్వారా 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు వారి జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకువస్తున్నాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles