Nirmal Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా జరగాలి
నిర్మల్: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని సూచించారు.
నామినేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించడంతో పాటు, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు, ప్రతినిధులు కేంద్రాలకు వచ్చినప్పుడు అవసరమైన సమాచారం, మార్గనిర్దేశం అందేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసిల్దార్ రాజు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


