Ainavolu Mallikarjuna Swamy: మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు దేవాదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, దేవాలయ అర్చకులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా స్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతను సీఎం గారికి వివరించగా, సంప్రదాయాలు, ఆచారాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటిగా నిలిచిందని, భక్తుల కోసం సౌకర్యాలు మరింత మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.
బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


