Yasangi Crop Water Release: సంక్రాంతి పండుగ సందర్భంగా యాసంగి పంటకు సాగునీరు విడుదల
మంచిర్యాల: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రైతులకు శుభవార్తగా, యాసంగి పంట సాగుకు అవసరమైన సాగునీటిని మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు విడుదల చేశారు.
దండేపల్లి మండలంలోని గుడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించే క్రమంలో, తానిమడుగు గ్రామం వద్ద 30వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి హజీపూర్ మండలంలోని 42వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు నీటిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. యాసంగి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


