Mothi Nagar Republic Day: జనసేన జెండా సెంటర్ల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
హైదరాబాద్ – మోతీ నగర్: మోతీ నగర్ పరిధిలో జిహెచ్ఎంసి ఎడ్ హక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మోతీ నగర్ జనసేన జెండా సెంటర్, పీఆర్ నగర్ జనసేన జెండా సెంటర్ల వద్ద జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు భారత జాతీయ జెండాను ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు.
అదేవిధంగా రాజీవ్ నగర్ జనసేన జెండా సెంటర్‌లో జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీ సాగర్ (ఆర్.కే నాయుడు) గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ సాగర్ గారు మాట్లాడుతూ,
జనసేన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జాతీయ భావజాలాన్ని యువత స్ఫూర్తిగా తీసుకొని, ప్రతి భారతీయుడు ఒక సైనికుడిగా దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అలాగే రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను గుర్తుంచుకుని నడుచుకోవాలని అన్నారు.
ఇక కళ్యాణ్ నగర్ జనసేన జెండా సెంటర్ వద్ద గిడుగు వెంకటరమణ గారు జాతీయ జెండాను ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో
జిహెచ్ఎంసి ఎడ్ హాక్ కమిటీ సభ్యులు శ్రీ బడే విశ్వేశ్వరరావు, బండికల్లు శ్యామ్ ప్రసాద్,
యూత్ విభాగ సభ్యులు మిరియాల చిట్టి బాబు, రాజేష్ సాహు,
మోతీ నగర్ జనసేన నాయకులు ప్రభు చైతన్య ఆరేటి, మట్టా శ్రీనివాస్, మత్తి శ్రీనివాస్, డా. కె.వి. శ్రీధర్, కాగితాల వెంకటేశ్వరరావు, సింహాద్రి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వందకు పైగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


