back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsతెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Gade Innayya: ఉద్యమానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి: జాగృతి అధ్యక్షురాలు

జనగామ జిల్లా / జఫర్ గఢ్ మండలం / సాగరం: తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్య గారి కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఇటీవల ఇన్నయ్య గారి తల్లి థెరిసమ్మ గారు మరణించడంతో, వారి కుటుంబాన్ని కలుసుకొని కవిత గారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి ధైర్యాన్ని అభినందించారు.

అనంతరం గాదె ఇన్నయ్య గారు నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించిన కవిత గారు, అక్కడ నివసిస్తున్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ,
ఎప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినా బలంగా ప్రజల పక్షాన, బాధితుల పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తి గాదె ఇన్నయ్య గారు. తెలంగాణ గురించి ఎవ్వరూ మాట్లాడని సమయంలోనే మనకు జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ప్రజల ముందు ఉంచి, ఎంతోమందిని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకువచ్చారు” అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఇన్నయ్య గారు చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆమె తెలిపారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles