Excise Constable Soumya: కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన కవితా కల్వకుంట్ల
హైదరాబాద్ / నిజామాబాద్: నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని బీఆర్ఎస్ నాయకురాలు కవితా కల్వకుంట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పందించిన కవితా కల్వకుంట్ల, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్సైజ్ సిబ్బంది భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె సూచించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


