Primary School: ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాల నూతన రూపం
హనుమాన్ గుడి సమీపంలోని ప్రాథమిక పాఠశాల చాలా కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయింది. ఈ పరిస్థితిలో పాఠశాల చైర్మన్‌గా ఉన్న మారపాక రేణుక గారు పలువురిని సహాయం కోరినా పెద్దగా స్పందన లభించలేదు.
అలాంటి సమయంలో మీసాల శేఖర్ గారు, శివరాత్రి స్వామి గారు పాఠశాలను సందర్శించి, దానిని దశలవారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి అడుగుగా పాఠశాలకు నూతన శోభ తీసుకొచ్చేలా రంగులు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇంతటితో ఆగకుండా, మరికొంత మంది దాతల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.వారు ప్రచారం చేయవద్దని కోరినా, ఇలాంటి మహోన్నత సేవ గ్రామానికి తెలియజేయడం మన బాధ్యతగా భావించి ఈ సందేశాన్ని పంచుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో మరో బాల్య స్నేహితుడు, పెయింట్ కాంట్రాక్టర్ అయిన మంద శ్రీనివాస్ గారు తక్కువ రేటుతో సేవలందిస్తూ రంగులు వేయడంలో తన వంతు సహకారం అందించారు.
మీసాల శేఖర్ గారు, శివరాత్రి స్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి దాతృత్వ భావనతో ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి గ్రామం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


