Kuruma Sarpanch Felicitation: కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో సర్పంచ్–ఉపసర్పంచ్‌ల ఘన సన్మాన కార్యక్రమం
కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుండే వెంకటేష్ కురుమ, గౌరవ అధ్యక్షులు శ్రీ గొరిగే నర్సింహా కురుమ (GNK) ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ కురుమ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ గారు, పెద్దపల్లి మాజీ ఎంపీ శ్రీ వెంకటేష్ గారు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి గద్వాల సరిత కురుమ గారు, శ్రీమతి తుల ఉమ కురుమ గారు, మాజీ కార్పొరేటర్ శ్రీ కౌడే పోచయ్య కురుమ గారు, న్యాయ సలహాదారులు శ్రీ నోముల ప్రసన్న కుమార్ కురుమ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ బెజడి బీరప్ప కురుమ గారు, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు శ్రీ ర్యాకల శ్రీనివాస్ కురుమ గారు, కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది సర్పంచ్‌లు, 50 మంది ఉపసర్పంచ్‌లు పాల్గొని, వారందరికీ శాలువాలతో ఘనంగా సన్మానం చేసి మెమెంటోలు అందజేశారు.
ఈ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కురుమ గారు మాట్లాడుతూ, “కురుమ సమాజం రాజకీయంగా వేగంగా ఎదుగుతోంది. అదే సమయంలో చదువులో కూడా ముందుండాలి. కురుమ యువత అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాను” అని తెలిపారు.
అనంతరం కురుమ యువ చైతన్య సమితి నూతన క్యాలెండర్‌ను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కురుమ సమాజంలో ఉత్సాహం, ఐక్యతను మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


