Lal Bahadur Shastri vardhanti: నివాళులు అర్పించిన సీఎం
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి అంకితభావంతో సేవలందించిన మహానేత అని కొనియాడారు. సాదాసీదా జీవనం, అచంచల దేశభక్తి, విలువలతో కూడిన రాజకీయాలు ఆయన జీవితానికి ప్రతీకలని పేర్కొన్నారు. “జై జవాన్ – జై కిసాన్” అనే నినాదంతో సైనికులు, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన దార్శనిక నాయకుడిగా శాస్త్రి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.
సంక్షోభ సమయంలో కూడా దేశాన్ని ధైర్యంగా నడిపించిన శాస్త్రి గారి నాయకత్వం నేటి తరాలకు ఆదర్శమని సీఎం అన్నారు. ఆయన చూపిన నిజాయితీ, కర్తవ్యనిష్ఠ, సేవాభావం ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన విలువలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


