Vemulawada Temple: వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న జాతర మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.
మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ గారు, ఆలయ కార్యనిర్వాహక అధికారి రమాదేవి గారు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతర మహోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లపై కూడా చర్చించినట్లు సమాచారం.
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతాయి.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


