Urea Shortage Sangareddy: జిల్లాలో రైతులకు యూరియా కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు పాల్గొని, జిల్లాలో రైతులకు యూరియా కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత సాగు కాలంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎరువుల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, నిల్వలు, పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
అలాగే ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాల సాధనకు వ్యవసాయ శాఖ–ఉద్యానవన శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ రైతులకు అవగాహన కల్పించడం, నాట్ల సరఫరా, సాంకేతిక సహాయం అందించడంలో వేగం పెంచాలని ఆదేశించారు.
ప్రభుత్వం నిర్దేశించిన ఆయిల్ ఫామ్ లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు మరింత చురుకుగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులు, సాగు పురోగతి, ఎరువుల నిల్వల వివరాలను కలెక్టర్‌కు నివేదించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


