Medaram Jatara Poster Launch: “మేడారం మహా జాతర” పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు
తెలంగాణ గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారక్క మహా జాతరకు సంబంధించి మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, శ్రీమతి సీతక్క, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్చకులతో కలిసి భక్తులను ఘనంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి “మేడారం మహా జాతర” పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.
భక్తులు ఎలాంటి అసౌకర్యం ఎదుర్కోకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, సంప్రదాయాలు–ఆచారాలకు పూర్తి గౌరవం ఇస్తూ జాతర నిర్వహిస్తామని తెలిపారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహా జాతరను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


