Media Center Inauguration: కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం
ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని డిపిఆర్ఓ కార్యాలయంలో మీడియా సెంటర్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా ప్రారంభించారు. ఎన్నికల సమాచారాన్ని మీడియాకు వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా ఈ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీమతి శ్యామలాదేవి, శ్రీ రాజేశ్వర్, సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీ డి. హనుమంత్ నాయక్, వ్యయ పరిశీలకురాలు శ్రీమతి ఎల్. విజయ, డిపిఆర్ఓ శ్రీ విష్ణువర్ధన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు, ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి అంశాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా, న్యాయంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


