Mera Yuva Bharat: ప్లాస్టిక్ రహిత వరంగల్‌కు యువత శ్రమదానం
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘మేరా యువ భారత్’ కార్యక్రమం భాగంగా అంతర్ రాష్ట్ర యువజన సమ్మేళనం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా యువతి–యువకులు శ్రమదానంలో పాల్గొని పబ్లిక్ గార్డెన్ పరిసరాలను శుభ్రపరిచారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంటూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని యువత ప్రాముఖ్యతగా వివరించారు.
వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. యువత ముందడుగు వేస్తే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


