Damodar Raja Narasimha: సీనియర్ కాంగ్రెస్ నాయకులు నారాయణ్ రెడ్డిని పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్:సంగారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్‌చార్జ్ శ్రీ సిద్ధంరెడ్డి నారాయణ్ రెడ్డి గారు హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా నారాయణ్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన కుమారుడు, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు శ్రీ ఉజ్వల్ రెడ్డి గారితో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు.
నారాయణ్ రెడ్డి గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


