Indiramma houses: నునావత్ భారతికి గృహప్రవేశం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం జిల్లా / పాలేరు నియోజకవర్గం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు తండాకు చెందిన నునావత్ భారతికి మంజూరై, నిర్మాణం పూర్తి అయిన ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు. గృహప్రవేశం సందర్భంగా లబ్దిదారుని కుటుంబ సభ్యులకు మంత్రి నూతన వస్త్రాలను కానుకగా అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుందని, ప్రతి సంవత్సరం అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


