SLBC Project Review: అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం
హైదరాబాద్: నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఎస్‌ఎల్‌బిసి (SLBC) ప్రాజెక్టు పనులపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, నీటిపారుదల శాఖ సలహాదారు శ్రీ ఆదిత్య నాథ్ దాస్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు ప్రస్తుత పురోగతి, సాంకేతిక అంశాలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి సమగ్రంగా చర్చించారు. పనులు వేగవంతంగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, గడువుల్లోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి కీలకమైన ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బిసి పనులు నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


