Mobile Network Problem: ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
ఖిలాషాపురం గ్రామంలో మొబైల్ నెట్‌వర్క్‌లు సరిగా పనిచేయకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాల్స్ సరిగా వెళ్లకపోవడం, ఇంటర్నెట్ సిగ్నల్ పూర్తిగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేక పోతున్నారు.
గ్రామంలోని రైతులు వ్యవసాయానికి సంబంధించిన వాతావరణ సమాచారం, పంటల ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌కు కాల్ చేయలేని పరిస్థితి నెలకొనడంతో పాటు, వైద్య సేవలు పొందడంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత సెల్‌టవర్ అధికారులకు, టెలికాం సంస్థలకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత టెలికాం అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఖిలాషాపురం గ్రామంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామ ప్రజలు గట్టిగా కోరుతున్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


