Wanaparthy Collector:మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు
వనపర్తి జిల్లాలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఐఏఎస్
శనివారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఐఏఎస్ అధ్యక్షతన వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను నిర్వహించారు.
ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు నిబంధనల ప్రకారం ఖరారు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా అన్ని వివరాలను స్పష్టంగా చదివి వినిపించడంతో పాటు, సంబంధిత పత్రాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఈ ప్రక్రియను నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


