Collector Abhilasha Abhinav: ముసాయిదా ఓటర్ల జాబితాపై సమీక్ష
నిర్మల్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వారీ ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముసాయిదా ఓటర్ల జాబితాను జనవరి 1న నోటీసు బోర్డులపై ప్రచురిస్తామని తెలిపారు. జాబితాలో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే సకాలంలో సమర్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం తుది ఓటర్ల జాబితాను 2026 జనవరి 10న విడుదల చేస్తామని వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, లోపరహితంగా నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వమే స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలకు పునాది అని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అప్పల గణేష్, శ్రావణ్ రెడ్డి, అజంబిన్ యహీయా, రాము, సయ్యద్ హైదర్, నాందేడపు చిన్ను, భరత్వి, జయ్, మజార్, వినోద్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


