Vivekananda’s 163rd Jayanti: లాలాపేటలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి జిల్లా అధ్యక్షులు శ్రీ భరత్ గౌడ్ గారు
స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లాలాపేటలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి జిల్లా అధ్యక్షులు శ్రీ భరత్ గౌడ్ గారు, జిల్లా మరియు డివిజన్ నాయకులతో కలిసి ఎన్. రాంచందర్ రావు గారు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు గారు మాట్లాడుతూ, దేశ యువతను జాగృతం చేసి ఆత్మవిశ్వాసం, సేవాభావం, జాతీయతను పెంపొందించిన మహానుభావుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఆయన చూపిన ఆలోచనలు, ఆదర్శాలు నేటికీ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
స్వామి వివేకానంద గారి సందేశాలను కేవలం జయంతి రోజున మాత్రమే స్మరించుకోవడం కాకుండా, వాటిని ప్రతి యువకుడు తన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే దేశ నిర్మాణానికి నిజమైన సేవ అవుతుందని ఆయన అన్నారు. యువశక్తి సంఘటితంగా పనిచేస్తేనే దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వివేకానంద గారి ఆశయాలను స్మరించుకున్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


