Nalgonda Municipal Corporation: రాష్ట్ర మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
నల్గొండ, శనివారం: రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మారుస్తూ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, శనివారం నల్గొండ పాత మున్సిపాలిటీ భవనంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, జిల్లా కలెక్టర్ శ్రీ బడుగు చంద్రశేఖర్ గారితో కలిసి మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, నల్గొండను నగరపాలక సంస్థగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీటి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నల్గొండ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమగ్ర ప్రణాళికలతో పనిచేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ హఫీజ్ ఖాన్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


