Chevela Sarpanches honored: చేవెళ్లలో నూతన సర్పంచులకు ఘన సన్మానం – గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర
చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని కె.జి.ఆర్. గార్డెన్‌లో, నియోజకవర్గం వ్యాప్తంగా గెలుపొందిన నూతన సర్పంచులను స్థానిక శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య గారితో కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పాలన సాగించాలని సూచించారు. గ్రామస్థాయి పాలనలో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


