Zero Accidents New Year Hyderabad 2026– డ్రంక్ డ్రైవింగ్‌పై కఠిన అమలు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను ఎలాంటి సంఘటనలు లేకుండా సురక్షితంగా నిర్వహించినందుకు హైదరాబాద్ సిటీ పోలీసుల కృషికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బలమైన అమలు చర్యలు, ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమాలు మరియు ప్రజల సహకారంతో ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తిగా(Zero Accidents New Year Hyderabad 2026) ప్రశాంతంగా ముగిశాయి.
ప్రత్యేకంగా నగరవ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ డ్రైవింగ్ అమలు డ్రైవ్‌ల కారణంగా సున్నా ప్రమాదాలు నమోదయ్యాయి. ఇది యాదృచ్ఛికంగా జరగలేదని, అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో బాధ్యత భావాన్ని పెంచాయని అధికారులు స్పష్టం చేశారు.
ప్రజల సహకారం వల్లే హైదరాబాద్ మరింత సురక్షితమైన, ప్రపంచ స్థాయి నగరంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహకారం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
“వేడుకలు ఆనందంగా జరుపుకోవచ్చు – కానీ ప్రమాదం లేకుండా” అనే సందేశాన్ని మరోసారి గుర్తు చేస్తూ,
నాషా + స్టీరింగ్ = ఖత్రా.
అని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


