వరంగల్‌లో బహుళ అంతస్తుల బస్ స్టేషన్ – అధికారులకు కీలక ఆదేశాలు
వరంగల్ నగరంలోని పాత ఆర్టీసీ బస్ స్టేషన్ స్థలంలో నిర్మాణంలో ఉన్న అధునాతన బహుళ అంతస్తుల (ఐదు అంతస్తులు) ఆధునిక బస్ స్టేషన్ పనులను అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, నిర్దేశిత గడువులోగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి అయ్యేలా నిత్యం పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అన్ని ఆధునిక సౌకర్యాలు అందేలా డిజైన్, భద్రత, సౌలభ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కాంట్రాక్టర్లు పనుల వేగాన్ని పెంచి, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అనంతరం, ఇప్పటికే సుమారు 90 శాతం పూర్తైన కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. మిగిలి ఉన్న లైటింగ్, చిన్నపాటి ప్యాచ్ వర్క్ పనులను త్వరితగతిన పూర్తి చేసి గార్డెన్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే వరంగల్ నగరానికి మరో ఆకర్షణగా నిలిచి, పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయని తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


