Malkajgiri Open Gyms: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బోడుప్పల్ ప్రాంతంలో బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) సహకారంతో, సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను ప్రారంభించడం జరిగింది.
బోడుప్పల్‌లోని ద్వారక కాలనీ, మారుతి కాలనీతో పాటు చెంగిచర్ల ప్రాంతంలోని జైశ్రీరామ్ కాలనీ, క్రాంతి కాలనీల్లో ఈ ఓపెన్ జిమ్‌లు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుతో యువతతో పాటు వృద్ధులు కూడా ఆరోగ్యంపై దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఇలాంటి సదుపాయాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టిన బీపీసీఎల్ సంస్థకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టి, నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రజలు ఈ ఓపెన్ జిమ్‌లను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


