Youth Skill Training: అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు ద్వారా భవిష్యత్‌కు బాటలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు.
బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మరియు ఐటీఐ కళాశాల భవనాల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
తరువాత అక్కడున్న విద్యార్థులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి మాట్లాడుతూ…
ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ స్కిల్స్‌తో కూడిన శిక్షణ ద్వారా స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు, ఐటీఐ కళాశాలలు యువతకు ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీలో ఇవి ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


