Malkajgiri Kattamaisamma Temple: బాధ్యులపై కఠిన చర్యలు కోరిన బీజేపీ
ఈ రోజు మల్కాజ్‌గిరి కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించిన బీజేపీ సీనియర్ నేత శ్రీ ఎన్. రామచందర్ రావు గారు, ఆలయంలో జరిగిన అమానుష ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి ఆలయంలో చోటు చేసుకున్న ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, దీనికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్న రామచందర్ రావు గారు, ఈ విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం క్షమించరానిదని విమర్శించారు. ఆలయాల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
హిందూ దేవాలయాల గౌరవం, భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ దృఢంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


