Parkal Municipality: పరకాల మున్సిపాలిటీ 22 వార్డులకు రిజర్వేషన్ల డ్రా
హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డు స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల డ్రా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా వార్డు రిజర్వేషన్లను ఖరారు చేయడంతో పాటు, మహిళలకు కేటాయించిన రిజర్వేషన్లను కూడా డ్రా పద్ధతిలో నిర్ణయించారు.
ఈ కార్యక్రమం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించగా, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై డ్రా ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


