Medaram Jatara: అమ్మవార్ల గద్దెల శాశ్వత నిర్మాణాల పురోగతిపై ఆర్ & బి శాఖ అధికారులతో సమీక్ష
మేడారం మహా గిరిజన జాతరకు ముందు భాగంగా సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నాను అని తెలిపారు. అనంతరం మహా గిరిజన జాతర ఏర్పాట్లు, అమ్మవార్ల గద్దెల శాశ్వత నిర్మాణాల పురోగతిపై ఆర్ & బి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరను భక్తి, శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని తెలిపారు.
భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చే ఈ జాతరలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, భద్రత తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అమ్మవార్ల గద్దెల శాశ్వత నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి, భవిష్యత్ తరాలకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


