Greater Warangal Municipal Corporation: వేసవి దృష్ట్యా అగ్నిమాపక నివారణ చర్యలు చేపట్టాలి: గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి గుండు
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఛాంబర్‌లో డి.ఆర్.ఎఫ్, ఇంజనీరింగ్ అధికారులతో అగ్నిమాపక నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ మేయర్ సుధారాణి గుండు పాల్గొన్నారు.
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో అగ్నిప్రమాదాలు జరగకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు, లాడ్జీలు, ఫంక్షన్ హాల్లు, బహుళ అంతస్తుల భవనాల సెల్లార్లలో ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయిస్తూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. భవన యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
నగర ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మేయర్ తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


