New Year celebrations: నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసుల అప్రమత్తత
డిసెంబర్ 31, 2025 నుంచి జనవరి 1, 2026 మధ్య రాత్రి నూతన సంవత్సర వేడుకలు (New Year celebrations)జరుపుకునే హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు, బార్-కమ్-రెస్టారెంట్ల కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. నగరంలో శాంతిభద్రతలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ఈ ఆదేశాలు ఇచ్చారు.
హోటళ్లు, పబ్‌లకు కీలక మార్గదర్శకాలు
-
అనుమతి పొందిన సమయం వరకే వేడుకలు నిర్వహించాలి
-
మైనర్లకు మద్యం విక్రయించరాదు
-
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు
-
అసభ్య నృత్యాలు, అశ్లీల ప్రదర్శనలకు అనుమతి లేదు
-
మహిళల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
-
CCTV కెమెరాలు పనిచేసేలా చూసుకోవాలి
-
శబ్ద కాలుష్య నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
భద్రతే ప్రధాన లక్ష్యం: సజ్జనార్
నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో పాటు ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యమని సజ్జనార్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


