PM SHRI Scheme: పీఎం శ్రీ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం
జనగాం జిల్లా / ఖిలాషాపూర్: పీఎం శ్రీ (PM SHRI) పథకం లో భాగంగా నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy) కార్యక్రమం కింద ఖిలాషాపూర్ లోని PMSHRI ZPHS పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా SBI బ్యాంకు సందర్శన, పొదుపు అవసరత, బ్యాంకింగ్ లావాదేవీలు, పాఠశాల కిడ్డీ బ్యాంక్ వివరాలు వంటి అంశాలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే ఆర్థిక నిర్వహణపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వక్తలు తెలిపారు.
ఈ అవగాహన సదస్సులో
- SBI జనగాం చీఫ్ మేనేజర్ శ్రీ V. రాజేష్ చంద్ర గారు,
- SBI ఖిలాషాపూర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి శైలజ గారు,
- CSC మేనేజర్ శ్రీ వీరన్న గారు పాల్గొని విద్యార్థులకు బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు ఖాతాల ప్రాముఖ్యతపై వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ డాక్టర్ భారత రవీందర్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


