Medaram Jathara: అమ్మవార్ల దర్శనం అనంతరం అధికారులకు కీలక సూచనలు
ములుగు జిల్లా: మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర తిరుగువారం సందర్భంగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, ములుగు జిల్లా కలెక్టర్ గారితో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు.
అనంతరం జాతర ప్రాంగణంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను సమీక్షించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.
ప్రత్యేకంగా పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు, చెత్త తొలగింపు, పారుదల వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. జాతర కాలంలో భక్తుల రాకపోకలు అధికంగా ఉండటంతో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరంగా జరగాలని ఆదేశించారు.
జాతరను భక్తిశ్రద్ధలతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క గారు సూచించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


