Dubba Rajarajeshwara Swamy Temple: మహా శివరాత్రి సందర్భంగా శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు
జగిత్యాల: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శానిటేషన్ చర్యలు నిరంతరం చేపట్టాలని, భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సౌకర్యాన్ని సమృద్ధిగా కల్పించాలని సూచించారు.
మహా శివరాత్రి సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారని, అందుకు అనుగుణంగా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


